
ఇంట్లో ఒక్క సారిగా ఎక్కువ మద్యం నిల్వ చేసుకునే వారికి ప్రభుత్వం ఒక్క షాకింగ్ విషయం చెప్పింది. ఇకపై ఎక్కువ మోతాదులో మద్యం నిల్వ చేసుకోవాలంటే తప్పని సరిగా లైసెన్స్ తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. పరిమితి దాటితే మందు కొనాలన్నా, రవాణా చేయాలన్నా, ఇంట్లో పెట్టుకోవాలన్నా కూడా లైసెన్స్ తప్పనిసరి అని ఈ కొత్త నిబంధన సారాంశం. అయితే ఇది ఉత్తర ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ సరి కొత్త రూల్ ప్రవేశ పెటింది.
దీని ప్రకారం ఒక వ్యక్తి లేదా ఒక ఇంట్లో గరిష్ఠంగా ఆరు లీటర్ల కంటే ఎక్కువ మద్యం ఉండకూడదు. అంతకంటే ఎక్కువ నిల్వ చేసుకోవాలంటే లైసెన్స్ తప్పని సరి. ఈ లైసెన్స్ ఫీజు ఏడాదికి రూ.12 వేలు. రూ.51 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. రిటైలర్స్ కు లైసెన్స్ ఫీజును 7.5 శాతం పెంచింది. గతేడాది కంటే ఈ ఏడాది ఎక్సైజ్ ఆదాయాన్ని రూ.6 వేల కోట్లు పెంచాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.