
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. నేటి మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి గర్నవర్ ఎయిర్పోర్టుకు.. అక్కడ నుంచి ఢిల్లీకి జగన్ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. మొదట కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ కానున్న జగన్ ఆ తర్వాత ఇతర మంత్రులతో కూడా సమావేశం కానున్నారు.
ఏపీలో తాజా పరిణామాలతో పాటు పలు అంశాలపైనా అమిత్ షాతో వైఎస్ జగన్ చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల విషయంపై జగన్ అమిత్ షాతో చర్మించనున్నట్టు తెలుస్తోంది. విగ్రహాల ధ్వంసం వెనక రాజకీయ కుట్ర ఉందని నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.
అలాగే పోలవరం ప్రాజెక్టు పెండింగు నిధులు, హైకోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.