ఫిబ్రవరి 5న విడుదల కానున్న జాంబిరెడ్డి..!

January 12, 2021 at 5:34 pm

టాలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ రూపొందించిన మూడో సినిమా జాంబీ రెడ్డి. ఈ చిత్రంలో తేజ స‌జ్జా, ఆనంది, దక్ష హీరో హీరోయిన్లు నటించిన ఈ మూవీ అసలు సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ కొంత మంది ఇండస్ట్రీ పెద్దల సలహా మేరకు ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేశామని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పారు.

ప్రస్తుతం క్వారెంటైన్ లో ఉన్న తమ జాంబిరెడ్డి మూవీని ఫిబ్రవరి 5న ప్రేక్షకులకు వినోదం పంచటం కోసం మూవీ థియేటర్లకు తీసుకొస్తామని ప్రకటించారు దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ. టాలీవుడ్‌కు జాంబీ కాన్సెప్ట్‌ను ప‌రిచ‌యం చేస్తూ మ‌రో హై-కాన్సెప్ట్ ఫిల్మ్‌తో, కరోనా నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఫిబ్రవరి 5న విడుదల కానున్న వైవిధ్యమయిన కాన్సెప్ట్ ఫిల్మ్‌తో రానున్న జాంబిరెడ్డి చిత్రం మరి ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించనుందో వేచి చూడాలి.

ఫిబ్రవరి 5న విడుదల కానున్న జాంబిరెడ్డి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts