చెన్నై వదిలించుకుంటే…హైదరాబాద్ తగిలించుకుంది

February 19, 2021 at 3:46 pm

2021ఐపిఎల్ మినీ ఆక్షన్ ముగిసింది వేలంలో క్రిస్ మోరిస్ ను (ఆర్ఆర్) ఇప్పటివరకు ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా అవతరించాడు, అదే విధంగా ఐపిఎల్ 2021 వేలంలో కృష్ణప్ప గౌతమ్ (సిఎస్కె) భారత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. టెస్ట్ బ్యాచ్ మెన్ అయిన చేతేశ్వర్ పూజారాను చెన్నై సూపర్ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ అర్జున్ టెండూల్కర్‌ను సొంతం చేసుకుంది. మొత్తం 292 ప్లేయర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా.. 57 మంది ప్లేయర్స్‌ను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నారు.

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ విషయానికి వస్తే.. ఈ వేలంలో కేవలం మూడు ఆటగాళ్లను మాత్రమే సొంతం చేసుకుంది. కొసమెరుపు ఏమిటంటే ఆ ముగ్గురిలో గత ఐపిఎల్ సీజన్లో (సిఎస్కె) ఓటమికి అత్యంత బాధితుడు అయిన ‘కేదార్ జాదవ్’ ను హైదరాబాద్ టీమ్ మరీ 2 కోట్లు వెచ్చించి సొంతం చేసుకొంది. ఒక విధంగా చెప్పలాంటి హైదరాబాద్ టీమ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. గత ఐపిఎల్ సీజన్లో ఆదుకోవాల్సిన సమయంలో కూడా చెన్నై టీమ్‌కు కేదార్ అండగా నిలబడలేకపోయాడు. దీనితో ఐపీఎల్ 2021లో కేదార్ జాదవ్ ఎలా రాణిస్తాడన్నది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. ఒక మంచి విషయం ఏమిటంటే యూఏఈ చెందిన స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్ సహచరుడు ‘ముజీబ్ రెహమాన్’ సొంతం చేసుకోవడం.

సన్‌రైజర్స్ హైదరాబాద్(జట్టు):
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), బెయిర్‌స్టో, విలియమ్సన్, మనీష్ పాండే, ప్రియం గార్గ్, విజయ్ శంకర్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, మిచెల్ మార్ష్, రషీద్ ఖాన్, అబిషేక్ శర్మ, నబీ, సాహా, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, నదీమ్, గోస్వామి, ఖలీల్ అహ్మద్, బసిల్ తంపి, విరాట్ సింగ్

కొత్తగా టీమ్‌లోకి వచ్చిన ఆటగాళ్లు: సుచిత్, కేదార్ జాదవ్, ముజీబ్ రెహమాన్

చెన్నై వదిలించుకుంటే…హైదరాబాద్ తగిలించుకుంది
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts