నితిన్ కెరీర్‌లో 2021 చాలా స్పెష‌ల‌ట‌.. ఎందుకంటే?

February 23, 2021 at 8:47 am

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కెరీర్‌లోనే 2021 చాలా స్పెష‌ల‌ట‌. ఎందుకంటే, లవ్ స్టోరీల నుంచి యాక్షన్, మాస్, థ్రిల్లర్స్ ఇలా ప్రతి జానర్ ట్రై చేస్తున్న నితిన్‌..`భీష్మ` వంటి మంచి హిట్ త‌ర్వాత వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. చంద్రశేఖర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హీరోగా తెర‌కెక్కిన `చెక్‌` చిత్రం ఫిబ్రవరి 26న విడుదల చేయనున్నాడు.

దీంతో నితిన్ ప్ర‌స్తుతం చెక్ ప్ర‌మోష‌న్ ప‌నుల్లో బిజీ బిజీగా ఉన్నారు. అలాగే వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్‌-కీర్తి సురేష్ జోడీగా తెర‌కెక్కుతున్న `రంగ్ దే` చిత్రం మార్చి 29న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి టీజర్, పోస్టర్స్‌ విడుదల కాగా.. మంచి స్పందన వచ్చింది. ఇక మ‌రోవైపు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంధధూన్ తెలుగు రీమేక్‌లో కూడా నితిన్ న‌టిస్తున్నాడు.

ఈ సినిమాలో నభా నటేష్‌తో పాటు తమన్నా కీలకపాత్ర పోషిస్తోంది. ఈ చిత్రాన్ని జూన్‌ 11న విడుదల చేయ‌నున్నారు. అయితే ఇంకా ఈ మూడు సినిమాలు రిలీజ్ కాకుండానే కృష్ణ చైతన్య తో పవర్ పేట మూవీని కూడా లైన్లో పెట్టారు నితిన్. ఈ చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుద‌ల కానుంది. ఇలా ఒకే ఏడాదిలో నాలుగు సినిమాలతో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేయ‌బోతున్నాడు. అందుకే నితిన్‌కు 2021 చాలా స్పెష‌ల‌ట‌.

నితిన్ కెరీర్‌లో 2021 చాలా స్పెష‌ల‌ట‌.. ఎందుకంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts