హీరో యశ్ కి ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా..!?

February 27, 2021 at 2:33 pm

యశ్ పేరుకు ఇప్పుడు పరిచయం అవసరం లేదు. ఎందుకంటే పాన్ ఇండియన్ హీరో అనే పదానికి ప్రభాస్ తర్వాత స్థానంలో నిలిచాడు యశ్. ఈయన నటించిన కెజియఫ్ చిత్రం యశ్ అంటే ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. 2018 వరకు యశ్ అంటే కేవలం కన్నడ ఇండస్ట్రీకి మాత్రమే తెలుసు. అక్కడ మాత్రమే ఆయన స్టార్ హీరో. కానీ ఒకే చిత్రంతో రాత్రికి రాత్రే నేషనల్ వైడ్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు యశ్ అంటే పాన్ ఇండియన్ హీరో. కెజియఫ్ చిత్రంతో సంచలన హిట్ సాధించి అన్ని ఇండస్ట్రీలలో పెద్ద గుర్తింపు తెచ్చుకున్నాడు యశ్. ఈ చిత్రం దాదాపు 200 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే ఇప్పుడు కెజియఫ్ 2 మూవీ పై కూడా అంతే అంచనాలు ఉన్నాయి. ఛాప్టర్ 2 రెలీజ్ ముందే యశ్ రేంజ్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా యశ్ దగ్గర ఉన్న కార్స్ కలెక్షన్ గురించి సోషల్ మీడియాలో హాట్ చర్చ జరుగుతుంది. ఆయన దగ్గర టాప్ మోడల్స్ కార్లు చాలా ఉన్నాయి.

కార్స్ విషయంలో యశ్ చాలా ఆసక్తి చూపిస్తుంటారు. మార్కెట్‌లోకి ఏ కొత్త కారు వచ్చినా తన వాకిట్లో ఆగాల్సిందే అంటాడు కెజియఫ్ హీరో. ప్రస్తుతం యశ్ దగ్గర అరడజన్‌కు పైగా కార్లు ఉన్నాయి. వాటిలో ఆడి క్యూ 7, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డి జీఎల్ఎస్ లైనప్‌లో టాప్ మోడల్‌ కార్‌తో పాటు బీఎమ్‌డబ్ల్యు 520డీ లాంటి విలాసవంతమైన అనేక కార్లు ఉన్నాయి. కన్నడ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో యశ్ ఒకరు. ఛాప్టర్ 2 కోసం 40 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నాడు. హోంబలే ఫిల్మ్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ అధీరా పాత్రలో నటిస్తున్నాడు. రవీనా టాండన్, రావు రమేష్‌, ప్రకాష్‌ రాజ్‌ వంటి ప్రముఖ నటులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. జులై 16, 2021న కెజియఫ్ 2 థియేటర్స్ లో విడుదల కానుంది.

హీరో యశ్ కి ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts