కోమాలో ముమైత్ ఖాన్..బాల‌య్య సినిమా షూట్‌లో తీవ్ర‌గాయాలు!

February 21, 2021 at 8:06 am

ముమైత్ ఖాన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈమె హీరోయిన్‌గా చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ.. ఐటెం సాంగ్స్‌తో యూత్ ని ఉర్రూతలూగించింది. కేవ‌లం తెలుగులోనే కాదు హిందీ, తమిళ, కన్నడ ఇలా అన్ని భాష‌ల్లోనూ ఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టింది ముమైత్‌.

ఇక ఇప్పుడు ఈమె సినిమాల్లో క‌నిపించ‌క‌పోయినా.. టీవీ షోలు చేస్తోంది. తెలుగు బిగ్ బాస్ షోలో కూడా మెరిసింది. ప్ర‌స్తుతం ఓంకార్ నిర్వ‌హిస్తున్న డ్యాన్స్ ప్లస్ అనే షోలో ముమైత్ ఓ జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ముమైత్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంది. ఈ క్ర‌మంలోనే తాను కోమాలో ఉన్న విషయం, నాడు జరిగిన సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.

ముమైత్ మాట్లాడుతూ.. నందమూరి బాలకృష్ణ నటించిన డిక్టేటర్ సినిమా షూటింగ్ సమయంలో సాంగ్ షూట్ చేస్తున్న సమయంలో జారిపడిపోయాను దాంతో తలకు తీవ్రగాయం అయ్యింది. ఆ సమయంలో 15 రోజులపాటు కోమాలోకి వెళ్ళాను. రెండు రోజులపాటునా తలనుంచి రక్తం కారుతూనే ఉంది. బంధువులు తానిక బతకడం కూడా కష్టమే అనుకున్నారు. డాక్టర్స్ 3 ఏళ్ల వరకు రెస్ట్ తీసుకోమన్నాంరు. కానీ నేను మూడునెలలకే తిరిగి షూటింగ్స్ మొదలు పెట్టా అంటూ ఎమోష‌న్ అయింది.

కోమాలో ముమైత్ ఖాన్..బాల‌య్య సినిమా షూట్‌లో తీవ్ర‌గాయాలు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts