దుబాయిలో ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ ఫామిలీ..!

February 25, 2021 at 12:43 pm

గ‌త కొంత కాలంగా పుష్ప మూవీ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్న అల్లు అర్జున్ హాలీడే టూర్‌కి దుబాయ్‌ వెళ్లారు. అక్క‌డ తన భార్య స్నేహా రెడ్డి, పిల్ల‌లు అయాన్, అర్హ‌తో క‌లిసి ఆనందంగా గ‌డుపుతున్నాడు. దుబాయ్‌లోని ఫేమస్‌ థీమ్‌ పార్క్‌ను సంద‌ర్శించిన బన్నీ అక్క‌డ పిల్ల‌ల‌తో ప‌లు గేమ్స్ కూడా ఆడాడు. చిల్డ్రన్స్‌ ప్లే మ్యూజియం ఎయిర్‌ గ్యాలరీలో అర్హ‌ను ఆడిస్తూ ఉన్న వీడియోను స్నేహా రెడ్డి త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా, ఇది ఫుల్ హల్చల్ గా మారింది.

పుష్ప షూటింగ్‌తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ప్ర‌స్తుతం కాస్త విరామం తీసుకున్నాడు. త్వ‌ర‌లో కేర‌ళ షెడ్యూల్‌కు వెళ్ళాలి. ఆ షెడ్యూల్‌లో కొన్ని కీల‌క సీన్స్ చిత్రీక‌రించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ప్యాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ర‌ష్మిక మంధాన హీరోయిన్ గా న‌టిస్తుంది. ఆగ‌స్ట్ 13న ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

దుబాయిలో ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ ఫామిలీ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts