యంగ్ హీరో కి బన్నీ సపోర్ట్…!?

February 27, 2021 at 2:17 pm
Allu-Arjun

అతి కొద్దీ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో కార్తికేయ. ఈయన హీరోగా ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం చావు కబురు చల్లగా. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వరస హిట్స్ తో దూసుకుపోతున్న యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ రానున్నారు అది కూడా ప్రత్యేకంగా హీరో కార్తికేయ కోసమే వస్తున్నాడు అంట అల్లు అర్జున్. ఇదే విషయం స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు. తాను కేవలం హీరో కార్తికేయ కోసమే చావు కబురు చల్లగా ఈవెంట్ కు వస్తున్నట్లు ఫాన్స్ కి చెప్పాడు బన్నీ. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సిచిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్నారు. ఆమని హీరో కార్టిహికేయ కు తల్లి పాత్రలో నటించారు. ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఈ చిత్రంలో ప్రత్యేక సాంగ్ చేసారు.

మార్చ్ 19న ప్రపంచ వ్యాప్తంగా చావు కబురు చల్లగా రిలీజ్ కానుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బన్నీ వస్తున్నారు కాబట్టి సినిమా పై మరింత హైప్ పెరగడం పక్కా. ఇంకా అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా వచ్చిన చాలా చిత్రాలు విజయం సాధించాయి. చావు కబురు చల్లగా మూవీకి కూడా ఇది కలిసి రానుంది అని టాక్. ఆర్ఎక్స్ 100 తర్వాత కార్తికేయకు హిట్ లేదు. మధ్యలో హీరోగా నటించిన సినిమాలు ఊహించిన స్థాయిలో అంచనాలు అందుకోలేదు. అదే సమయంలో విలన్ గా మారి గ్యాంగ్ లీడర్ చేసాడు. కాబ్బటి ఇప్పుడు చావు కబురు చల్లగా చిత్రం కార్తికేయ కెరీర్ కు కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో లక్కీ హ్యాండ్ అల్లు అర్జున్ చేతుల మీదుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈసారి అయినా కార్తికేయ ఫేట్ మారుతుందో లేదో వేచి చూడాలి.

యంగ్ హీరో కి బన్నీ సపోర్ట్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts