వామ్మో..`పుష్ప‌` కోసం బ‌న్నీ అన్ని గంట‌లు మేక‌ప్ వేసుకుంటున్నాడా?

February 23, 2021 at 11:27 am

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నాడు.

ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. అయితే స్మ‌గ్ల‌ర్ లుక్‌లో క‌న‌ప‌డ‌డానికి బ‌న్నీ భారీగానే శ్ర‌మిస్తున్నాడ‌ట‌. సాధార‌ణంగా బ‌య‌ట చాలా స్టైలిష్ గా క‌న‌ప‌డే బ‌న్నీ ఈ సినిమాలో మాత్రం న‌ల్ల‌గా, మాసిన గ‌డ్డంతో క‌న‌ప‌డాల్సి ఉంది.

దీంతో షూటింగ్‌ ఉన్న ప్రతిరోజు మూడు నుంచి నాలుగు గంట‌ల పాటు బ‌న్నీకి మేక‌ప్ వేయ‌డానికే స‌మ‌యం ప‌డుతుంద‌ట‌. బ‌న్నీ జుట్టు, మీసాలు, చర్మం రంగు వంటి అన్ని అంశాల‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మేక‌ప్ చేస్తున్నార‌ట‌. దీని బ‌ట్టీ చూస్తుంటే.. బ‌న్నీ ఎంత పుష్ప కోసం ఎంత క‌ష్ట‌ప‌డుతున్నాడో అర్థం చేసుకోవ‌చ్చు. కాగా, ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 13న విడుద‌ల చేయ‌నున్నారు.

వామ్మో..`పుష్ప‌` కోసం బ‌న్నీ అన్ని గంట‌లు మేక‌ప్ వేసుకుంటున్నాడా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts