అన‌సూయ షాకింగ్ నిర్ణ‌యం.. ఇక‌పై వాటికి దూర‌మ‌ట‌?

February 23, 2021 at 9:36 am

అనసూయ భరద్వాజ్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర స్థార్ యాంక‌ర్స్‌లో ఒక‌రిగా స‌త్తా చాటుతున్న అన‌సూయ‌.. న‌టిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా రంగస్థలంలో రంగమ్మత్తగా అన‌సూయ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. దీంతో అప్ప‌టి నుంచి ఆమెకు అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక వీలున్న‌ప్పుడ‌ల్లా ఐటెం సాంగ్స్‌లో కూడా మెరుస్తుంది అన‌సూయ‌. ప్ర‌స్తుతం యంగ్ హీరో కార్తికేయ తాజా చిత్రం `చావుకబురు చల్లగా`లో అన‌సూయ ఐటెం సాంగ్ చేసింది. ఈ సాంగ్ సినిమాకే హైలైట్ కాబోతోంద‌ట‌. ఇదిలా ఉంటే.. తాజాగా అన‌సూయ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. అయితే ఈ ఇంట‌ర్వ్యూలో ఫ్యూచ‌ర్‌లో స్పెష‌ల్ సాంగ్స్‌లో న‌టిస్తారా అన్న ప్ర‌శ్నించ‌గా.. అందుకు అన‌సూయ ఇక‌పై ఎలాంటి స్పెష‌ల్ సాంగ్స్ చేయ‌న‌ని తెగేసి చెప్పేసింది.

చావు క‌బురు చ‌ల్ల‌గాలో తాను చేసిన స్పెష‌ల్ సాంగ్‌ని జానీ మాస్టర్ కొరియోగ్ర‌ఫీ చేశార‌ని.. ఆయ‌న త‌న స్నేహితుడు కాబ‌ట్టి అడిగినందుకు చేశాన‌ని అన‌సూయ స్ప‌ష్టం చేసింది. ఇక‌పై స్పెష‌ల్ సాంగ్స్‌కు దూరంగా ఉంటాన‌ని.. ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల్లో మాత్రమే న‌టిస్తాన‌ని అన‌సూయ తెలిపింది. కాగా, అన‌సూయ తాజా చిత్రం `థ్యాంక్యు బ్ర‌ద‌ర్` విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

అన‌సూయ షాకింగ్ నిర్ణ‌యం.. ఇక‌పై వాటికి దూర‌మ‌ట‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts