
బుల్లితెర హాట్ యాంకర్స్‌లో ఒకరైన శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టీవీ షోలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శ్రీముఖి.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.
ఇక ఈ షో తర్వాత టీవీ షోలతో పాటుగా సినిమాల్లో కూడా ఆఫర్లు దక్కించుకుంటోంది. అయితే ప్రస్తుతం శ్రీముఖి ఎంతో ఎగ్జైట్‌గా ఉంది. శ్రీముఖి ఇంత ఎగ్జైట్‌గా ఉండడానికి కారణం లేకపోలేదు. నితిన్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అందాదున్’ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కీలక పాత్ర పోషిస్తుండగా.. నభా నటేష్ హీరోయిన్గా నటిస్తోంది.
జూన్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో శ్రీముఖి కూడా నటించబోతోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో శ్రీముఖిని ఈ చిత్రంలో చూపించబోతున్నారట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా శ్రీముఖి తెలుపుతూ.. హ్యాపీగా మరియు ఎగ్జైట్‌గా ఉందని పేర్కొంది. దీంతో అందాదున్ రీమేక్‌లో శ్రీముఖి రోల్ ఎలా ఉండబోతోంది? అన్నది ఆసక్తికరంగా మారింది.