మ‌హేష్ `స‌ర్కారు`లో మ‌రో స్టార్ హీరోయిన్‌..?!

February 23, 2021 at 8:00 am

టాలీవుడ్ ప్రిన్స్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హేష్‌కు జోడీగా మొద‌టి సారి కీర్తి సురేష్ న‌టిస్తోంది. 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దాదాపు నెల రోజులకిపైగా దుబాయ్‌లో షూటింగ్‌ జరుపుకున్న సర్కారు వారి పాట సినిమా షెడ్యూల్‌ ఆదివారంతో పూర్తయింది. దీంతో త‌దుప‌రి షెడ్యూల్ కోసం చిత్రం యూనిట్ గోవాకు రీచ్ అయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ చిత్రంలో కీర్తితో పాటుగా మ‌రో స్టార్ హీరోయిన్ కూడా ఉండ‌నుంద‌ట‌. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. తాజాగా ఈ సినిమా స్టోరీలో పరశురామ్ కొన్ని మార్పులు చేశాడ‌ట‌. దాంతో కథలో కీలక పాత్ర కోసం హీరోయిన్ ను వెతుకుతున్నాడట దర్శకుడు. అయితే కథను మలుపు తిప్పే క్యారెక్టర్ కావ‌డంతో.. స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేయాల‌ని ప‌రుశురామ్ భావిస్తున్నాడ‌ట‌.

మ‌హేష్ `స‌ర్కారు`లో మ‌రో స్టార్ హీరోయిన్‌..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts