అనుప‌మ‌కు మ‌రో బంప‌ర్ ఛాన్స్ ఇచ్చిన యంగ్ హీరో?

February 23, 2021 at 11:56 am

అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నితిన్ హీరోగా తెర‌కెక్కిన `అఆ` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన అనుప‌మా.. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంది. అయితే అందం, అభిన‌యం, న‌ట‌న ఇలా అన్ని విధాలుగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన అనుప‌మ‌కు ఇటీవల కాలంలో అవ‌కాశాలు భారీగా తగ్గిపోయాయి.

మ‌ళ్లీ ఇప్పుడిప్పుడే అనుప‌మ పుంజుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌స్తుతం నిఖిల్ హీరోగా తెర‌కెక్కుతున్న `18 పేజీస్` చిత్రం‌లో అనుప‌మ నటిస్తోంది. అలాగే తమిళంలో ఈమె నటించిన రెండు సినిమాలు పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ జరుపుకుంటున్నాయి. అయితే తాజాగా నిఖిల్ అనుప‌మ‌కు మ‌రో బంప‌ర్ ఛాన్స్ ఇచ్చాడు.

నిఖిల్ హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న చిత్రం `కార్తికేయ-2`. కార్తికేయ కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనుప‌మ ఎంపిక్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

అనుప‌మ‌కు మ‌రో బంప‌ర్ ఛాన్స్ ఇచ్చిన యంగ్ హీరో?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts