రేషన్ డెలివరీదారులకు జ‌గ‌న్ స‌ర్కార్ అదిరిపోయే శుభ‌వార్త‌!

February 6, 2021 at 12:54 pm

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం రేషన్ డోర్ డెలివరీ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. రేషన్ డోర్ డెలివరీ చేసేందుకు ప్రత్యేక వాహనాలను కూడా చేయించింది. కానీ, ఆ వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ప్రైవేట్ వారి నుండి తీసుకుంది. ఆ వాహనంకు నెలకు 16 వేల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది.

అయితే ప్రభుత్వం ఇస్తున్న జీతాలకు తాము ఇంటింటికి తిరిగి రేషన్ అందించలేమని పలుచోట్ల వాహనాల డ్రైవర్లు నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో తాజాగా జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రేషన్ డెలివరీదారులకు అదనంగా చెల్లించాలని నిర్ణయించింది.

ప్రస్తుతం ఒక్కో రేషన్‌ పంపిణీ వాహనదారునికి.. వాహన అద్దె, పెట్రోల్, హెల్పర్‌ చార్జ్‌ల కింద 16 వేల రూపాయలు చెల్లిస్తుండగా.. ఇకపై మొత్తంగా 21 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కో రేష‌న్ వాహ‌న‌దారుడికి అద‌నంగా రూ.5 వేల రూపాయ‌లు అంద‌నున్నాయి.

రేషన్ డెలివరీదారులకు జ‌గ‌న్ స‌ర్కార్ అదిరిపోయే శుభ‌వార్త‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts