పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం…!?

February 19, 2021 at 1:34 pm

కరోనా వైరస్ కారణంగా విద్యా వ్యవస్థ చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. స్కూల్స్ ని మరచి పిల్లలు ఇంట్లోనే ఆన్ లైన్ క్లాసులు మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు కొంచెం చక్కబడటంతో మళ్లీ పాఠశాలలు పున:ప్రారంభమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అన్ని క్లాసుల విద్యార్థులు స్కూళ్లకు వెళ్తున్నారు. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఉపాద్యాయులు తరగతులను నిర్వహిస్తున్నారు. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రమోషన్ సిస్టమ్ ఉండటంతో ఇబ్బందులేమీ రాలేదు కానీ, పదో తరగతి విషయంలోనే విద్యాశాఖ తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. చివరకు గత ఏడాది పదో తరగతి విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించారు. తాజాగా ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు నిర్వహణ విషయంలో ఏపీ సర్కారు ఒక ముఖ్య నిర్ణయాన్ని తీసుకుంది.

ఇప్పటికే కరోనా కారణంగా క్లాసులు సరిగ్గా జరగనందున 11 పేపర్లకు బదులుగా 7 పేపర్లుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, గణితం, సోషల్ పేపర్లను 100 మార్కులకు ఫిజికల్ సైన్స్, బయాలజీ పేపర్లను చెరో 50 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కులకు పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. తాజాగా, పరీక్షల్లో మరో కీలక మార్పునకు సంబంధించిన డీటెయిల్స్ ని ఏపీ విద్యాశాఖ వెల్లడించింది. మాములుగా సబ్జెక్టుకు వంద మార్కుల్లో 80 మార్కులకు పరీక్షలు నిర్వహించి మరో 20 మార్కులను ఇంటర్నల్ పరీక్షలకి ఇచ్చే వారు. ఇప్పుడు ఈ ఏడాదికి ఆ విధానాన్ని రద్దు చేస్తూ, పూర్తిగా 100 మార్కులకు పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించారు. ఈ మేరకు పరీక్షా విధానంలో మార్పుల గురించి ఏపీ విద్యాశాఖ గురువారం ప్రత్యేక జీవోను జారీ చేసింది. ఒక్కో మార్కువి 12 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, రెండు మార్కుల స్వల్ప ప్రశ్నలు 8, నాలుగు మార్కుల సమాధాన ప్రశ్నలు 8, ఎనిమిది మార్కుల ప్రశ్నలు 5 ఉండనున్నాయి. మొత్తం రెండున్నర గంటల టైములో ఈ ప్రశ్నలకు సమాధానాలు విద్యార్థులు రాయాల్సి ఉంటుంది.

పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts