
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందడి కొనసాగుతూనే ఉంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయో లేదో.. మళ్లీ మున్సిపల్ ఎన్నికల హడావుడి ప్రారంభం అయింది. 2020లో కరోనా కారణంగా వాయిదా పడిన మున్సిపల్ ఎన్నికలను ఇప్పుడు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల అయింది.
మార్చిన 10న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అవసరం అయిన చోట్లు మార్చి 13న రీపోలింగ్ ఉంటుంది. అలాగే మార్చి 14 ఓట్ల లెక్కింపు జరుగనుంది. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుని.. మందుబాబుకు షాక్ ఇచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతాయి కాబట్టి ప్రభుత్వం తగిన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఇందులో భాగంగానే… మార్చి 8, 9, 10 తేదీల్లో వైన్ షాపులు బంద్ చేయనుంది. అంటే ఎన్నికలు జరిగే పట్టణాల్లో పోలింగ్‌కి 48 గంటల ముందు మద్యం అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోనుంది. ఈ మేరకు చీఫ్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్ జిల్లాల కలెక్టర్లను ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఓట్ల లెక్కింపునకు 24 గంటల ముందు కూడా మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు.