నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం…!?

February 28, 2021 at 4:16 pm

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గొప్ప శుభవార్త. యువతకు వరసగా జాబ్ మేళాను నిర్వహిస్తున్న APSSDC మరో ప్రకటన విడుదల చేసింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగ నియామకాలను చేపట్టనుంది. హెచ్బిఎల్ ఇండస్ట్రీస్ లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేశారు. అర్హులైన ఇంకా ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చ్ 5 తేదీ ఉదయం 9 గంటలకు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావాల్సింది గా చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం లోని మిరియం డిగ్రీ కాలేజీ లో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. అర్హులైన ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ కు చెందిన అధికారిక వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారు స్పష్టం చేశారు. అయితే ఈ పోస్టులకు కేవలం పురుషుల నుంచి మాత్రమే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 200 ఖాళీలను వారు భర్తీ చేయనున్నారు.

ఐటిఐ – ఫిట్టర్, డీజిల్, మెకానిక్, డిప్లమా, బీటెక్ -మెకానికల్, ఎలక్రికల్ విద్యార్హతలు కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు. టెక్నీకల్ విభాగంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఎంపికైన అభ్యర్థులకు వేతనం నెలకు రూ. 12వేలతో పాటు పీఎస్, ఈఎస్ఐ ఆహారం, వసతి సదుపాయాలను కూడా వారు కల్పించనున్నారు. ఎంపిక అయినా అభ్యర్థులు విజయనగరం లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి వయసు 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే www.apssdc.in వెబ్ సైట్ లో నమోదు చేసుకోవచ్చు. ఇక జాం సెషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూ కి హాజరయ్యే అభ్యర్థులు ఆధార్ కార్డు, పాన్ కార్డు, జిరాక్స్ లతోపాటు స్టడీ సర్టిఫికెట్స్ ను కూడా తీసుకుని వెళ్ళాలి. మరేమైనా సందేహాల నివృత్తి కోసం 9000831156, 7386706272 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts