
అరియానా గ్లోరీ.. ఈ పేరుకు ప్రస్తుతం పరిచయాలు అవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ ద్వారా పాపులరై.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది అరియానా. తనదైన ఆట తీరు.. మాట తీరుతో ప్రేక్షకుల మెప్పించి బిగ్ బాస్ షో ఫైనల్స్ వరకు చేరుకుంది.
కానీ, టైటిల్ దక్కించులేకపోయింది. ఇక హౌస్ నుంచి బటకు వచ్చిన అరియానా టీవీ షోలతో పాటు సినిమా ఆఫర్లను కూడా దక్కించుకుంటోంది. ఇప్పటికే రాజ్ తరుణ్ సినిమాలో ఛాన్స్ పట్టేసిన ఈ భామ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
తాజాగా అరియానా దగ్గరకు ఒక సినిమా వెళ్లగా.. ఆమె రూ. లక్ష రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. దీంతో ఆమె దగ్గరకు వెళ్లిన దర్శక, నిర్మాతలు షాక్ తిన్నారట. అయితే చివరకు అటు చేసి, ఇటు చేసి ఆమెను 25 వేల రూపాయలకు ఒప్పించారని తెలుస్తోంది.