ప్రిన్సెస్‌ ఆఫ్‌ బిగ్‌బాస్‌ అయిన బోల్డ్ బ్యూటీ..!!

February 11, 2021 at 2:05 pm

యాంక‌ర్‌గా తన స‌త్తా చూపెడుతూ దూసుకుపోతున్న స‌మ‌యంలో సంచ‌ల‌న వివాదాస్పద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ను ఇంట‌ర్వ్యూ చేసి వార్త‌ల‌లోకి ఎక్కింది అరియానా. ఆ త‌ర్వాత బిగ్ బాస్ సీజ‌న్ 4‌లో కంటెస్టెంట్‌గా హౌస్ లోకి అడుగు పెట్టి, త‌న‌దైన శైలిలో గేమ్ ఆడుతూ ముందుకు వెళ్లిన అరియానా టాప్ 5లో ఒక‌రిగా నిలిచింది. బిగ్ బాస్ షో త‌ర్వాత అరియానా క్రేజ్ మాములుగా లేదు.

పాపుల‌ర్ సెల‌బ్రిటీగా మారిన అరియానా, హీరో రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న మూవీలో న‌టించే అవ‌కాశాన్ని పొందింది. ఇక ఇప్పుడు ఈ అందాల భామకి అరుదైన ఘ‌న‌త ద‌క్కింది. గూగుల్‌లో ప్రిన్సెస్‌ ఆఫ్‌ బిగ్‌బాస్‌ తెలుగు అని టైప్‌ చేయగా అరియానా గ్లోరీ పేరు చూపిస్తుంది. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తూ, సీరియ‌స్లీ అసలు మాములుగా ఉండదు అరియానా అంటే అంటూ కామెంట్ కూడా పెట్టింది.

ప్రిన్సెస్‌ ఆఫ్‌ బిగ్‌బాస్‌ అయిన బోల్డ్ బ్యూటీ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts