పవర్ స్టార్‌తో జ‌త‌క‌ట్టిన యాదాద్రి చీఫ్ ఆర్కిటెక్ట్..!!

February 25, 2021 at 1:49 pm

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సినీ ప్రేక్ష‌కుల‌కు బాగా పరిచయయిన వ్యక్తే. అద్భుత కళా నైపుణ్యంతో ఎన్నో అవార్డులు పొందిన ఆనంద్ సాయి గత ఐదు సంవత్సరాలకు పైగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చీఫ్ ఆర్కిటెక్ట్ గా పనులు నిర్వ‌హిస్తున్నారు. ఇవి చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో తిరిగి సినిమాలకు ప‌ని చేసేందుకు రెడీ అయ్యారు.

ఆనంద్ సాయి గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో జత కట్టి తొలి ప్రేమ‌, త‌మ్ముడు, ఖుషీ , జ‌ల్సా వంటి సినిమాలకు వర్క్ చేశాడు. ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ కళ్యాణ్ హీరోగా తెర‌కెక్క‌నున్న సినిమాకు కళా దర్శకునిగా నిర్వహించనున్నారు. కొద్ది సేప‌టి క్రితం చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ సంగతిని ప్ర‌క‌టించింది. సుదీర్ఘ విరామం తరువాత ఆయన కళా దర్శకునిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మూవీ పవన్ కళ్యాణ్‌ది కావటం మరో విశేషం. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

పవర్ స్టార్‌తో జ‌త‌క‌ట్టిన యాదాద్రి చీఫ్ ఆర్కిటెక్ట్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts