
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయాపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడో సారి `బిబి3` వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం మే 28 విడుదల కానుంది. అయితే ఈ చిత్రం తర్వాత బాలయ్య ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే అనిల్ రావిపూడి, సంతోష్ శ్రీనివాస్, బి. గోపాల్ వంటి దర్శకుల పేర్లు వినిపించినా.. ఇండస్ట్రీ వర్గాల తాజా సమాచారం ప్రకారం బాలయ్య డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో తన నెక్స్ట్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడట. ఇప్పటికే గోపిచంద్ మలినేని .. బాలయ్య ఇమేజ్‌కు తగ్గ ఓ కథను వినిపించి ఓకే చేయించుకున్నాడు.
ఈ సినిమాపై మే నెలలో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. కాగా, రవితేజ హీరోగా ఇటీవల `క్రాక్` వంటి మాస్ మసాలా ఎంటర్టైనర్ను తెరకెక్కించి.. సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు గోపిచంద్ మలినేని. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న ఈయనతో బాలయ్య నెక్స్ట్ సినిమా ఉంటే.. దబిడి దిబిడే అంటున్నా అభిమానులు.