
బుచ్చిబాబు సానా.. ప్రస్తుతం ఈ పేరు మారుమోగిపోతోంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్గా `ఉప్పెన` చిత్రాన్ని తెరకెక్కించాడు బుచ్చిబాబు.. మొదటి సినిమాతోనే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. సుకుమార్ ప్రియ శిష్యుడైన బుచ్చిబాబు.. మొదటి సినిమానే అయినా ఎంతో అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకుల చేత, సినీ పెద్దల చేత శభాష్ అనిపించుకున్నాడు.
దీంతో బుచ్చిబాబు తదుపరి చిత్రం ఎవరితో ఉంటుందా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. అక్కినేని యంగ్ హీరో అఖిల్‌తో బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే బుచ్చిబాబు అఖిల్‌కు కథ చెప్పగా.. ఆయనకు బాగా నచ్చేసింది. దీంతో వెంటనే అఖిల్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు టాక్.
ఇక `ఉప్పెన` తరహాలోనే ఇంటెన్స్ లవ్‌స్టోరీగా ఆ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. అఖిల్-బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోయే చిత్రాన్ని కూడా మైత్రీ మూవీస్ సంస్థనే నిర్మించబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన కూడా రానుందట.