దారుణం : యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ యాంకర్…!?

February 28, 2021 at 3:51 pm

మహిళల పై జరుగుతున్న అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎదో ఒక రూపంలో కామాంధులు చెలరేగిపోతున్నారు. స్త్రీల పై నిత్యం అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కాలేజీకి వెళ్లిన చోట, పనిచేసే కార్యాలయాల్లోనూ స్త్రీల పై వేధింపుల నడుస్తూనే ఉన్నాయి. చివరికి కన్న తండ్రి, తోడ బుట్టిన సోదరులు కూడా స్త్రీలను లైంగిక వస్తువు లానే చూస్తున్నారు. నిర్భయ, దిశ వంటి చట్టాలు తెచ్చి కఠిన శిక్షలు విధిస్తున్నా ఈ ఘోరమయిన అఘాయిత్యాలకు ఆగటం లేదు. తాజాగా 22 ఏళ్ల యువతి పై ఓ యాంకర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ హోటల్ కు తీసుకెళ్లి మరీ ఆమె పై లైంగిక దాడికి దిగాడు. జరిగిన సంఘటన నుంచి తేరుకున్న యువతి, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి,వెంటనే అతడి పై తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ వారిని కోరింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలోని ఖాన్ మార్కెట్లో 22 ఏళ్ల యువతి ఉండగా అక్కడకు 28 ఏళ్ల ఓ యువకుడు వచ్చాడు. అతడు ముంబైలోని ఓ బడా వ్యాపారవేత్త కొడుకు మరియు ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్ లో యాంకర్ గా పని చేస్తున్నాడు. అయితే ఆ యువతికి, ఆ యాంకర్ కు మూడేళ్లుగా పరిచయం ఉంది. తెలిసిన వ్యక్తే కావడంతో పిలిచిన వెంటనే ఆమె అతని దగ్గరకు వెళ్లింది. తన కుటుంబ సభ్యులు దగ్గరలోని హోటల్ లో ఉన్నారనీ, పరిచయం చేస్తానని చెప్పి ఆమెను అక్కడికి తీసుకెళ్లాడు. ఢిల్లీలోని చక్రాయపురిలో ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు ఆ యువతిని తీసుకెళ్లాడు. అయితే ఆమెను అతడి కుటుంబ సభ్యులు ఉన్న గదికి కాకుండా, వేరే ప్రత్యేక గదికి తీసుకెళ్లాడు. కొద్దిసేపు ఫ్రెషప్ అయ్యాక వెళ్దామని చెప్పాడు. ఆ తర్వాత ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె తీవ్రంగా ప్రతి ఘటిస్తున్నా అఘాయిత్యం చేశాడు. జరిగిన సంఘటన నుంచి తేరుకున్న యువతి వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ యాంకర్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు గురువారం నాడు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామనీ, ఆధారాలు సేకరించి అతడిని అరెస్ట్ చేస్తామని తెలిపారు.

దారుణం : యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ యాంకర్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts