
కృతి శెట్టి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన కృతి.. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో చూపించిన అభినయం, డైలాగ్ డెలివరీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
దీంతో కృతి శెట్టికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఉప్పెన విడుదలకు ముందే నాని `శ్యామ్ సింగరామ్`, సుధీర్ బాబు సినిమాల్లో ఛాన్స్ దక్కించుకున్న కృతి.. స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆఫర్లు దక్కించుకుంటోంది. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి తాజాగా కృతికి లేఖతో పాటు గిఫ్ట్‌ను పంపి సర్ప్రైజ్ చేశారు. చిరు పంపిన లేఖలో పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న దానికి నువ్వొక ఉదాహరణ.
స్టార్ కావడం కోసమే నువ్వు పుట్టావు. భాష తెలియకపోయినప్పటికీ, పాత్రలో అద్భుతంగా జీవించావు. ఇక ముందు ముందు మంచి విజయాలను సాధించకుంటూ ఇలానే ముందుకు సాగిపో అని ఉంది. ఇక ఈ లేఖను సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ.. కృతి ఆనందంలో తేలిపోయింది. మీరు పంపిన గిఫ్ట్, మీ మాటలు ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతాయి అంటూ కృతి పేర్కొంది.