చిత్రం సినిమాకు సీక్వెల్ ప్ర‌క‌టించిన దర్శకుడు..!!

February 22, 2021 at 1:53 pm

టాలీవుడ్‌లో ఉన్న ప్రముఖ ద‌ర్శ‌కుల‌లో తేజ ఒక‌రు. కెమెరా మెన్ నుంచి దర్శకుడుగా చిత్రం మూవీతో అడుగు పెట్టిన దర్శకుడు తేజ నితిన్, ఉదయ్ కిరణ్, రీమా సేన్, సదా, కాజల్, నవదీప్, సుమన్ శెట్టి వంటి నటీనటులతో పాటు ఆర్పి పట్నాయక్ వంటి సంగీత దర్శకులని కూడా పరిశ్రమకు ప‌రిచ‌యం చేశాడు. హిట్ ఫ్లాపులు చూసుకోకుండా వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ వెళ్తున్న తేజ చివ‌రిగా నేనే రాజు నేనే మంత్రి అనే చిత్రంతో మంచి విజయం కొట్టారు. బెల్లం కొండ శ్రీనివాస్, కాజల్ హీరో హీరోయిన్స్‌గా సీత సినిమా తో ప్రేక్షకులను అల‌రించాడు.

రానాతో ఓ సినిమా ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన తేజ తాజాగా చిత్రం మూవీ సీక్వెల్‌ను త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా అనౌన్స్ చేశాడు. చిత్రం 1.1 పేరుతో రూపొంద‌నున్న ఈ చిత్రం 2021లోనే షూటింగ్ మొదలవనుంది. తొలి పార్ట్‌కు సంగీతం అందించిన ఆర్పీ ప‌ట్నాయ‌క్ ఇప్పుడు సీక్వెల్ చిత్రానికి కూడా సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌ని చేయ‌నున్నారు.న‌టీన‌టులు ఎవ‌రనే దానిపై ఇంకా తెలియాలి. చిత్రం సినిమా 2000 జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాగా, గ‌త ఏడాది జూన్ 16కు 20 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది.

చిత్రం సినిమాకు సీక్వెల్ ప్ర‌క‌టించిన దర్శకుడు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts