క‌త్తి గుచ్చుకుని వ్య‌క్తి మృతి..అరెస్ట్ అయిన కోడి!

February 26, 2021 at 7:01 pm

అవును, మీరు విన్న‌ది నిజ‌మే. క‌త్తి గుచ్చుకుని వ్య‌క్తి మృతి చెందితే.. కోడి అరెస్ట్ అయింది. విన‌డానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..జగిత్యాల జిల్లా గొల్లపల్లి పరిధిలోని లొత్తునూర్ శివారులో ఇటీవ‌ల ఓ ఘటన చోటుచేసుకుంది. సతీష్(45) అనే వ్య‌క్తి కోడి పందేలు ఆడటానికి కోడి కాలికి కత్తి కట్టగా.. కోడి జంప్ చేసింది.

ఈ క్ర‌మంలోనే స‌తీష్ కడుపు భాగంలో కత్తి తీవ్రంగా గుచ్చుకుంది. ఇది గ‌మ‌నించిన చుట్టుపక్కల వారు వెంటనే అతడిని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయ‌గా.. మ‌ధ్య‌లోనే మృతి చెందారు. అయితే ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. సతీశ్ మరణానికి కారణమైన కోడిని అరెస్ట్ చేశారు.

కేసులో ఏ1గా కోడిని చేర్చి.. లాక‌ప్‌లో పెట్టారు పోలీసులు. అంతేకాదు, ఆ కోడిని పోలీసులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. దానికి తిండి, నీరు అందిస్తున్నారు. ఇక ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుండగా.. నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు.

క‌త్తి గుచ్చుకుని వ్య‌క్తి మృతి..అరెస్ట్ అయిన కోడి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts