భారత్ ప్లేయర్స్ కి కరోనా పాజిటివ్…!?

February 23, 2021 at 5:02 pm
covid vijay

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపింది. విజయ్‌ హజారే ట్రోఫీలో పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. బీహార్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర జట్లకు చెందిన ఒక్కో ఆటగాడికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని బీసీసీఐ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ముగ్గురు ఆటగాళ్లను ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంచినట్లు స్పష్టం చేశారు.

covid vijay

covid vijay

గతవారమే మహారాష్ట్ర, హిమాచల్‌ ప్రదేశ్‌కు ప్లేయర్లకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇరుజట్లలోని ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఒకరితో మరొకరు కలవద్దని ఆదేశించారు. ఇరు జట్ల ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించిన తర్వాతే.. వారిని తదుపరి మ్యాచ్ ఆడేందుకు అనుమతిస్తారు. అయితే కరోనా సోకిన ఆటగాళ్ల పేర్లను మాత్రం బీసీసీఐ ప్రకటించలేదు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలోనూ జమ్ము కాశ్మీర్‌కు చెందిన ఓ క్రికెటర్‌కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. బీహార్ ఆటగాడికి పాజిటివ్‌ రావడం ఇదే మొదటిసారి. బీహార్ సోమవారం కర్ణాటకతో మ్యాచ్ ఆడింది. దీంతో ఇరు జట్లను మంగళవారం పరీక్షించాల్సి ఉంది.

భారత్ ప్లేయర్స్ కి కరోనా పాజిటివ్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts