ఏపీలో పెరిగిన క‌రోనా కేసులు..ఆ జిల్లాలోనే అధికం!

February 27, 2021 at 7:08 pm

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు.

ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న స్వ‌ల్పంగా పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 118 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 8,89,799 కి చేరింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 33 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క మ‌ర‌ణం కూడా లేక‌పోవ‌డం ఊర‌ట‌నిచ్చే అంశం.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 7,169 ద‌గ్గ‌ర నిలిచింది. అలాగే కొత్తగా రికవరీ అయిన వారి సంఖ్య 86 నమోదు కాగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 8,81,963 కి చేరుకుంది. ప్ర‌స్తుతం ఏపీలో 667 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక నిన్న ఒక్క రోజే 37,041 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించారు అధికారులు.

ఏపీలో పెరిగిన క‌రోనా కేసులు..ఆ జిల్లాలోనే అధికం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts