దేశంలో నిన్న మ‌రింత పెరిగిన క‌రోనా కేసులు.. తాజా లెక్క ఇదే!

February 28, 2021 at 11:26 am

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు అత‌లాకుత‌లం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా వైర‌స్‌ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేష‌న్ కూడా ప్రారంభించారు.

ఇదిలా ఉంటే.. భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతుండ‌డం ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌ర పెడుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 16,752 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.11 కోట్లకు చేరువ‌వుతోంది. అలాగే నిన్న 113 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు.

తాజా లె‌క్క‌ల‌తో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,57,051 కి పెరిగింది. ఇక నిన్న ఒక్క‌రోజే 11,718 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1.07 కోట్లుకు పైగా మంది కోలుకోగా.. 1,64,511 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, నిన్న ఒక్క రోజే 7,95,723 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా క‌రోనా టెస్ట్‌ల సంఖ్య 21.62 కోట్లు దాటింది.

దేశంలో నిన్న మ‌రింత పెరిగిన క‌రోనా కేసులు.. తాజా లెక్క ఇదే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts