తెలంగాణ‌లో 1,632కు చేరిన మ‌ర‌ణాలు.. పాజిటివ్ కేసులెన్నంటే?

February 26, 2021 at 5:31 pm

కంటికి క‌నిపించ‌ని అతిసూక్ష్మ‌జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌కు పాకేసి ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్ర‌పంచ‌దేశాల‌కు శ‌త్రువుగా మారిన‌ ఈ క‌రోనా మ‌హ‌మ్మారి.. ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో అని ప్ర‌జ‌లు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య నిన్న స్వ‌ల్పంగా మెరిగాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 189 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 2,98,453 కి చేరింది. నిన్న క‌రోనా కార‌ణంగా ఇద్ద‌రు మ‌ర‌ణించారు.

దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,632 ద‌గ్గ‌ర నిలిచింది. అలాగే ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2,94,911 కి చేరుకుంది. ప్ర‌స్తుతం తెలంగాణలో 1910 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 818 హోంఐసోలేష‌న్‌లో ఉన్నారు.

తెలంగాణ‌లో 1,632కు చేరిన మ‌ర‌ణాలు.. పాజిటివ్ కేసులెన్నంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts