ఇప్పటి నుంచి డార్క్ మోడ్‌లోనూ గూగుల్ మ్యాప్స్…!?‌

February 24, 2021 at 1:13 pm

ఈ మధ్య కాలంలో స్మార్ట్‌ ఫోన్లు నిత్యావసరం వస్తువులా మారాయి. అవి చూసి చూసి కళ్లు కూడా బాగా దెబ్బతింటున్నాయి. దీనికి డార్క్ మోడ్ ఫీచర్‌తో మొబైల్ కంపెనీలు కళ్లకు కాస్త శ్రమ తగ్గిస్తున్నాయి. ఈ ఫీచర్ వరుసగా ఒక్కో యాప్‌కూ అందుబాటులోకి వస్తోంది. తాజాగా గూగుల్ తన మ్యాప్స్‌కు కూడా డార్క్ మోడ్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇది అందరు వినియోగదారులకు అందుబాటులో ఉంది. యాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి థీమ్‌లో ఆల్‌వేస్ ఇన్ డార్క్ థీమ్ సెలక్ట్ చేసుకుంటే చాలు మ్యాప్స్‌ను డార్క్ మోడ్‌లో చూడొచ్చు.

ఈ ఫీచర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుందని గూగుల్ చెబుతోంది. ఇది ఇష్టం లేనివాళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే డార్క్ మోడ్ వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గడంతోపాటు బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. ఇది వరుకు మాత్రం చీకటి పడుతుంటే నావేగేటింగ్ డార్క్ మోడ్‌లోకి, ఉదయం పూట మళ్లీ లైట్ మోడ్‌లోకి మారేది.

ఇప్పటి నుంచి డార్క్ మోడ్‌లోనూ గూగుల్ మ్యాప్స్…!?‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts