
బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకొణేకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశ విదేశాలలో విపరీతమైన అభిమానుల్ని పెంచుకున్న దీపిక మరి కొద్ది రోజులలో కపిల్ బయోపిక్ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించనుంది. అయితే ఇటీవలే ఈ బ్యూటీ ముంబైలోని టోరీ అనే రెస్టారెంట్ నుండి బయటకు వస్తుండగా, కొందరు ఫాన్స్ ఆమెతో ఫొటోస్ దిగడం కోసం ఎగబడ్డారు.
వారి నుండి తప్పించుకొని దీపిక తన కారు దగ్గరకు వెళ్ళే క్రమంలో, ఎవరో తన బ్యాగ్‌ను వెనక్కు లాగినట్టు అనిపించి దీపిక వెంటనే ఏక్ మినిట్, ఏక్ మినిట్ అంటూ తన బ్యాగ్‌ను జాగ్రత్తగా భద్ర పరుచుకుంటూ తన కారు దగ్గరకు వెళ్ళిన దీపిక పదుకొనే కారులోకి ఎక్కాక చిరు నవ్వుతో ఫొటోగ్రాఫర్స్‌కు ఫోజులిచ్చి బైబై చెప్పి వెళ్ళిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.