
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఆ మధ్య కాస్త జోరు తగ్గించిన రకుల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తుంది రకుల్. అయితే ఈ అమ్మడు హిందీలో నటిస్తోన్న ప్రాజెక్టుల్లో ఒకటి ‘ఎటాక్ ’. జాన్ అబ్రహాం హీరోగా లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతోన్న ఈ సినిమా షూటింగ్ ఉత్తర ప్రదేశ్ లోని ధనిపూర్‌లో జరుగుతోంది. అయితే ఈ మూవీ షూటింగ్ గురించి తెలుసుకున్న స్థానికులు చిత్రీకరణ చూసేందుకు భారీగా తరలివచ్చారు. కానీ, వారికి షూటింగ్ చేసేందుకు సెక్యూరిటీ అనుమతి ఇవ్వకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ క్రమంలోనే కొందరు స్థానికులు రాళ్ళతో దాడి కూడా చేశారు. ఈ దాడిలో కొందరు సెక్యూరిటీ గార్డులు గాయపడ్డారు. అయితే ఇంతలోనే పోలీసులు రంగప్రవేశం చేసి స్థానికులను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దు మణిగింది. దాంతో షూటింగ్ ప్రశాంతంగా జరిగింది.