శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో గోపీచంద్ మలినేని..!!

February 9, 2021 at 2:55 pm

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ సినీ దర్శకుడు గోపీచంద్‌ మలినేని కూడా ఒకరు. మంగళవారం నాడు తిరుపతిలో, శ్రీ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనం టైములో స్వామిని వారిని దర్శించుకొని తన మొక్కులు చెల్లించుకున్నారు ఆయన. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చెయ్యగా, తిరుమల ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు వారికి అందజేశారు.

ఆలయం వెలుపల దర్శకుడు గోపీచంద్‌ మీడియాతో మాట్లాడారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. క్రాక్‌ చిత్రం ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఘన విజయం సాధించిందని ఆయన చెప్పారు. ఆ తిరుమలేశుడి సేవలో చాలా సంతోషంగా ఉంది, మైత్రీ మూవీస్‌ బ్యానర్‌పై అతి త్వరలోనే మరో కొత్త ప్రాజెక్టు చేస్తున్నట్లు దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపారు.

శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో గోపీచంద్ మలినేని..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts