
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఇటీవల `ఉప్పెన` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వడమే కాదు.. డబ్యూ మూవీతో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డులను మరియు కలెక్షన్స్‌ను సాధించాడు. అయితే ఉప్పెన విడుదలకు ముందే వైష్ణవ్.. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్‌తో ఓ సినిమాను పట్టాలెక్కించాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయింది.
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. కొండపొలం అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు `కొండపొలం` టైటిల్‌నే ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఉప్పెన మంచి విజయం సాధించడంతో.. విష్ణవ్ రెండో సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
దీంతో చిత్ర యూనిట్ లేట్ చేయకుండా ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్ర బిజినెస్ ఇటీవలే క్లోజ్ అయింది. దిల్ రాజు క్యాంప్ నుండి బయటకు వచ్చిన లక్ష్మణ్ కొన్నాడని టాక్. లక్ష్మణ్ దాదాపు 11 కోట్ల రూపాయలకు ఈ సినిమా రైట్స్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం..ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయనున్నారని తెలుస్తోంది.