నటుడిగా మారిన ప్రముఖ తమిళ దర్శకుడు.!!

February 25, 2021 at 1:04 pm

ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ కూడా నటుడిగా మారిపోయాడు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా తమిళంలో పలు మంచి చిత్రాలను రూపొందించాడు సెల్వరాఘవన్. తెలుగులోనూ విక్టరీ వెంకటేశ్ హీరోగా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి హిట్ సినిమాని తెరకెక్కించాడు. సెల్వ రాఘవన్ తమ్ముడు ధనుష్‌ ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. నిజానికి సెల్వ రాఘవన్ తాను నటుడిగా మారుతున్నట్టు గత సంవత్సరం డిసెంబర్ లోనే ప్రకటించాడు.

రాకీ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న సాని కాయిధమ్ సినిమాలో సెల్వ రాఘవన్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీనికి సంబంధించిన మూవీ ఫస్ట్ లుక్ గత సంవత్సరం డిసెంబర్ లోనే రిలీజ్ కాగా, ఫిబ్రవరి 25 గురువారం రోజు తొలిసారి ముఖానికి రంగేసుకుని సెల్వ రాఘవన్ షూటింగ్ లో పాల్గొన్నాడు. 23 సంవత్సరాలుగా దర్శకుడిగా ఉన్న తాను మొదటి సారిగా నటుడిగా మారానని సెల్వ రాఘవన్ తెలిపాడు. మరి నటుడిగా మారిన ఈ ప్రముఖ దర్శకుడు తన నటనతో ఎలాంటి పేరు తెచ్చుకుంటాడో వేచి చూడాలి.

నటుడిగా మారిన ప్రముఖ తమిళ దర్శకుడు.!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts