మార్చి 8 నుంచి ప్రారంభం అవ్వనున్న దృశ్యం 2 షూటింగ్..!?

February 26, 2021 at 11:22 am

ప్రముఖ మలయాళీ నటుడు మోహన్ లాల్ తాజాగా నటించిన సినిమా దృశ్యం 2. ఈ చిత్రం 2013లో వచ్చిన దృశ్యంకు సీక్వెల్ గా వచ్చింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో కూడా రీమేక్ చెయ్యనున్నారు. మలయాళంలో సూపర్ విజయం సాధించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ట్విస్ట్‌లు, కథనం ప్రేక్షకుల్నీ బాగా ఆకట్టుకున్నాయి. అనుకోకుండా జరిగిన ఓ మర్డర్ నుంచి తన కుటుంబాన్ని ఆ హీరో ఎలా కాపాడుకున్నాడు అనేది కథ. చిత్రంలో మీనా, మోహన్ లాల్ అదరగొట్టారు. ఈ చిత్రం మలయాళంలో పెద్ద విజయం పొందింది. ఇక అదే చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్ 2014లో రీమేక్ చేశాడు. దృశ్యం మాతృకను జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేయగా, తెలుగులో శ్రీప్రియ ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది.

ఇక ఇటీవల ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ లేటెస్ట్ దృశ్యం 2 ఫిబ్రవరి 19, 2021న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టకుంటోంది. ఈ దృశ్యం 2 చిత్రాన్ని ఆషిర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించాడు. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ముఖ్యంగా జార్జ్ కుట్టి పాత్రలో మోహన్ లాల్ నటనకు నెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో మోహల్ లాల్‌తో పాటు ఇతర పాత్రల్లో మీనా, ఎస్తేర్ అనిల్, అన్సిబా హసన్, ఆశా శరత్, సిద్దిక్, మురళి గోపీ, కృష్ణ, సాయి కుమార్, జిబి గణేష్ కుమార్, అనీష్ జి మీనన్, కోజికోడ్ నారాయణన్ నాయర్ వంటి తదితరులు నటించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ రీమేక్ చేయనున్నాడు. మార్చి 8 నుంచి మొదలుకానున్న వెంకటేష్ జీతూ జోసెఫ్ దృశ్యం 2 షూటింగ్.

మార్చి 8 నుంచి ప్రారంభం అవ్వనున్న దృశ్యం 2 షూటింగ్..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts