
అహ్మదాబాద్‌లో జరిగిన డే నైట్ టెస్టులో ఇంగ్లాండ్ పరాభవానికి స్పిన్‌కు అనుకూలించే వికెటే కారణమని అనేక విమర్శలు వచ్చిన క్రమంలో ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ జొనాథన్ ట్రాట్ స్పందించి, పిచ్‌ను నిందించడం ఏమాత్రం సరి కాదు అని, అలా చేయడం తప్పని జొనాథన్ అన్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో మరింత మంచిగా బ్యాటింగ్ చేసి ఉంటే పరిస్థితులు విభిన్నంగా ఉండేవన్నాడు. ‘ఎవరికైనా అక్కడ ఆడటం కొన్ని సార్లు కష్టమనే అనిపించింది. అది జీవం లేని వికెట్లా కూడా కనిపించింది. మొదట్లో దానికి అలవాటు పడడంతో మంచి స్కోర్ సాధించి టీమ్ఇండియా పై ఒత్తిడి తేగలము అని అనుకున్నాం. తర్వాత మేం బౌలింగ్ చేశాక, టీమ్ ఇండియాను కూడా కట్టడి చేయొచ్చని భావించారు.
అయితే, మా ఓటమికి సాకులు చూసే కన్నా ఏం చేస్తే జట్టుకు మంచిది అనే విషయం పైనే నేనెప్పుడూ దృష్టి సారిస్తా. మొదట ఇన్నింగ్స్‌లో మా జట్టు 200-250 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆటగాళ్ల ఆలోచనా దృక్పథం కూడా మారిపోయి ఉండొచ్చు’ అని ట్రాట్ అన్నాడు.
ఈ నేక్రమంలో పిచ్‌ను నిందించడం ఏమాత్రం సరి కాదని, అలా చేస్తే తమని తాము కించ పర్చకున్నట్లే అని ఇంగ్లాండ్ బ్యాటింగ్ కోచ్ అభిప్రాయపడ్డాడు. బంతి తిరగడం ఇరు జట్లకూ సమానమేనని చెప్పాడు. మ్యాచ్ ఎన్ని రోజుల్లో ముగిసినా అందరూ మంచి క్రికెట్‌నే చూడాలనుకుంటారని వారు అభిప్రాయపడ్డాడు. బ్యాట్స్‌మెన్, బౌలర్ల మధ్య పోటీ వాతావరణం ఆస్వాదించాలనుకుంటారని వివరించాడు. అయితే, ఈ టెస్టులో బౌలర్ల ఆధిపత్యం కనపడిందని జొనాథన్ స్పష్టం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వివిధ పరిస్థితుల్లో ఆడటమే టెస్టు క్రికెట్ ప్రత్యేకతని ఈ ఫార్మాట్‌ను కొనియాడాడు జొనాథన్ .