
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో జోరు చూపిస్తూ వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న రకుల్ గ్రాఫ్ ఇటీవల దారుణంగా పడిపోయింది. మళ్లీ ఇప్పుడిప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా మారింది. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగు తెరపై `చెక్` సినిమాతో కనిపించబోతోంది రకుల్.
నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రియాప్రకాశ్ వారియర్ నితిన్ లవర్‌గా కనిపించనుండగా.. రకుల్ లాయర్ పాత్ర పోషించింది. ఇక ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు చిత్ర యూనిట్ ఈ మధ్య జోరుగా ప్రమోషన్స్ చేసింది. ఈ ప్రమోషన్స్‌లో రకుల్ మినహా అందరూ పాల్గొన్నారు. చెక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ రకుల్ కనిపించలేదు.
సరే ప్రీరిలీజ్ కు రాలేదు అనుకుంటే.. మరి నెక్స్ట్ ప్రెస్ మీట్ టీవీ ప్రోగ్రాంస్ ఇలా దేనికి కూడా రకుల్ హాజరు కాలేదు. దీంతో రకుల్ ఎందుకిలా చేస్తుందంటూ ఆమెపై తెలుగు అభిమానులు గుర్రుగా ఉన్నారట. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత రకుల్ నుండి విడుదల అవుతున్న ఫస్ట్ సినిమా ఇది. అలాంటి ఇంపార్టెంట్ సినిమా ప్రమోషన్స్‌లో రకుల్ లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.