ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..శివరాత్రికి జాతరే జాత‌ర‌?

February 25, 2021 at 9:31 am

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే `వ‌కీల్ సాబ్‌` పూర్తి చేసిన ప‌వ‌న్‌.. ఇటీవ‌లె క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎ.ఎం.రత్నం భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్లుగా నటిస్తుట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా నుంచి ప్రీ లుక్ పోస్టర్ మిన‌హా మ‌రే అప్డేట్ బ‌య‌ట‌కు రాలేదు. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ కాస్త అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. శివ‌రాత్రి సంద‌ర్భంగా మార్చి 11న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌నున్నార‌ట‌. అంతేకాదు, అదే రోజు టైటిల్ కూడా అనౌన్స్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఒక‌వేళ ఇదే జ‌రిగితే.. ఈ శివ‌రాత్రికి ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి జాత‌రే జాత‌ర‌ని అంటున్నారు. కాగా, ఈ చిత్రానికి `హరిహర వీరమల్లు` టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..శివరాత్రికి జాతరే జాత‌ర‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts