సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్న సుమ…హీరో ఎవరంటే…!?

February 28, 2021 at 3:18 pm
suma

బుల్లితెర అభిమానులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కాలంగా టాప్ యాంకర్ గా దూసుకు వెళ్తున్న సుమకు అప్పటి నుంచి ఇప్పటి వరకు పోటీగా ఎవరూ లేరు. తన షో లతో పాటు తన స్టేజ్‌ కార్యక్రమాలతో సుమ చేసే సందడి అంతా ఇంతా కాదు.పెద్ద ఎత్తున సుమ చేస్తున్న కార్యక్రమాలతో ఆమె మరింతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవుతూనే ఉంది.

suma

suma

చిత్ర పరిశ్రమలో మొదట్లో సీరియల్స్ చేసిన ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన యాంకర్ గానే సెటిల్ అయింది. అంతేకాకుండా బుల్లితెరలో యాంకరింగ్ చేస్తూ మూవీ ఈవెంట్ లతో బిజీబిజీ గా కనిపిస్తుంది. తాజాగా ఈమె ఒక కీలక పాత్రలో యంగ్‌ హీరో సినిమాలో కనిపించేందుకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. గతంలో సుమ పలు సినిమాల్లో నటించారు.

ఇప్పుడు సుమ సినిమాల్లో నటిస్తుందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఏ 1 ఎక్స్ ప్రెస్ సినిమాలో యాంకర్ సుమ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో కామెంటేటర్ పాత్రలో సుమ నటిస్తుంది. సుమ కామెంటరీ తో పాటు ఈ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా ఉంటాయని వార్తలు వస్తున్నాయి.

అయితే హాకీ మ్యాచ్‌ నేపథ్యంలో సాగుతున్న సినిమా అవ్వడంతో క్లైమాక్స్ దాదాపుగా 20 నుండి 30 నిమిషాల పాటు హాకీ మ్యాచ్‌ ఉంటుందట. ఆ మ్యాచ్ లో సుమ యాంకరింగ్ సీరియస్ గా సాగడంతో పాటు అప్పుడప్పుడు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఉంటుందని అంటున్నారు. ఎక్కువ సేపు సీన్స్ ఉండటం వల్ల ప్రేక్షకులు బోర్‌ ఫీల్‌ కాకుండా ఉండే ఉద్దేశ్యంతో సుమ వాయిస్ ను కీలక పాత్రగా పెట్టినట్లుగా చెబుతున్నారు.

సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్న సుమ…హీరో ఎవరంటే…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts