య‌ష్ గ‌జ‌కేస‌రి చిత్ర టీజ‌ర్ రిలీజ్..!!

February 26, 2021 at 12:24 pm

ప్రముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారాడు హీరో య‌ష్‌. ఇప్పుడు ఆయ‌న చేస్తున్న ప్ర‌తి చిత్రం నేష‌న‌ల్ మీడియా క‌వ‌ర్ చేస్తుంది. కేజీఎఫ్ సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 అనే సినిమాని చేసిన య‌ష్ ఈ చిత్రాన్ని జూలై 16న రిలీజ్ చేయ‌నున్నాడు. ఈ చిత్రం కోసంయాష్ అభిమానులు ఇంకా ప్రేక్షకులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే కేజీఎఫ్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌ర‌య్యాడు య‌ష్‌.

దీంతో ఆయ‌న న‌టించిన చిత్రాలను డ‌బ్ చేసి ఇక్క‌డ రిలీజ్ చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా య‌శ్, అమూల్య‌, సాధు కోకిల ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎస్ కృష్ణ తెర‌కెక్కించిన గ‌జ‌కేస‌రి సినిమాని మార్చి 5న ఇక్కడ రిలీజ్ చేయ‌నున్నారు మేకర్స్. 2014 మే 23న ఈ క‌న్న‌డ చిత్రం శాండ‌ల్‌వుడ్‌లో రిలీజ్ కాగా, ఇప్పుడు తెలుగులో విడుదల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. సాయంత్రం 4.05 ని.ల‌కు ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు.

య‌ష్ గ‌జ‌కేస‌రి చిత్ర టీజ‌ర్ రిలీజ్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts