ఆలియా గంగూభాయ్ టీజ‌ర్ విడుదల..!!

February 25, 2021 at 1:39 pm

బాలీవుడ్ ప్రముఖ నటి ఆలియా భ‌ట్ న‌టిస్తున్న గంగూభాయ్ క‌తియావాడి మూవీ టీజ‌ర్‌ను బుధ‌వారం నాడు విడుదల చేశారు. గంగూభాయ్ టీజ‌ర్ రిలీజ్‌ అయింది. దీనిలో ఆలియా న‌ట‌న‌కు బాలీవుడ్ ప్రముఖులు అంతా ఫిదా అయ్యారు. సంజ‌య్ లీలా భ‌న్సాలీ దర్శకత్వంలో ఆ ఫిల్మ్ రూపుదిద్దు కుంటోంది. అయితే ఆ చిత్రం టీజర్ ఇప్పుడు సోష‌ల్ మీడియా లో ఫుల్ ట్రెండ్ అవుతోంది.

బాలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖ హీరోలు కూడా ఆలియా నటనకు ఫిదా అవుతూ ట్వీట్స్ చేస్తున్నారు. బాలీవుడ్షా ప్రముఖ నటులు అయిన షారూక్ ఖాన్‌, అక్ష‌య్ కుమార్‌, ప్రియాంకా చోప్రా, ర‌ణ్‌వీర్ సింగ్‌, క‌ర‌ణ్ జోహార్ లాంటి వారంతా గంగూభాయ్ మూవీ టీజ‌ర్‌ను ప్ర‌శంసిస్తూ పలు ట్వీట్లు చేశారు. గంగూభాయ్ చాలా స్పెష‌ల్‌గా ఉందంటూ ఆలియాను షారూక్ పొగిడారు. ఈ చిత్రం అద్భుత విజ‌యం సాధించాలంటూ షారూక్ త‌న ట్వీట్‌ ద్వారా తెలిపి అభినందనలు చెప్పారు.

ఆలియా గంగూభాయ్ టీజ‌ర్ విడుదల..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts