గ్రేట‌ర్ పీఠంపై గులాబీ జెండా.. ఉద్య‌మ‌బిడ్డ‌కు మేయ‌ర్ ప‌ద‌వి

February 11, 2021 at 1:03 pm

గ్రేట‌ర్ హైద‌రాబాద్ పీఠంపై గులాబీ జెండా మ‌రోసారి ఎగిరింది. ఉద్య‌మ బిడ్డ‌కే మేయ‌ర్ ప‌ద‌విని వ‌రించింది. ఆది నుంచి చివ‌రి వ‌ర‌కూ ఉత్కంఠ‌గా సాగిన ఈ ప్ర‌క్రియ చివ‌ర‌కు ప్ర‌శాంతంగా ముగిసింది. రిట‌ర్నింగ్ అధికారి, హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ శ్వేతా మ‌హంతి స‌మ‌క్షంలో గురువారం ఉద‌యం మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌, కార్పొరేట‌ర్ల ప్ర‌మాణ స్వీకారోత్స‌వం సాగింది. ఎక్స్ ఆఫీషియో స‌భ్యుల‌తో క‌లుపుకుని మొత్తంగా 87 మంది స‌భ్యుల బ‌లమున్న టీఆర్ ఎస్ మేయ‌ర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మేయ‌ర్‌గా బంజారాహిల్స్ నుంచి రెండో సారి ఎన్నికైనా గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి పేరు కార్పొరేట‌ర్ బాబా ఫిసియుద్దీన్ ప్ర‌తిపాదించ‌గా, గాజుల రామారం కార్పొరేట‌ర్ శేష‌గిరి బ‌ల‌ప‌రిచారు. అనంత‌రం ఓటింగ్ జ‌ర‌గ‌గా గులాబీ స‌భ్యులు ఏక‌ప‌క్షంగా మ‌ద్ద‌తు తెలిపారు. దీంతో మెజార్టీతో మేయ‌ర్‌గా ఎన్నికైన‌ట్లు శ్వేతా మ‌హంతి ప్ర‌క‌టించారు.

ఇక డిప్యూటీ మేయ‌ర్ తార్నాక నుంచి గెలుపొందిన మోతె శ్రీ‌ల‌తారెడ్డి ఎన్నిక‌య్యారు. చేతులెత్తే విధానం ద్వారా ఈ ఎన్నిక ప్ర‌క్రియ చివ‌రి వ‌ర‌కూ ఉత్కంఠ‌గా కొన‌సాగింది. ఎన్నిక ప్ర‌క్రియ పూర్తి కావ‌డంతో మొత్తంగాగ్రేటర్ మూడవ పాలకవర్గం కొలువుతీరింది. మొద‌టి సారి ఉద్యమకారుడికే మేయ‌ర్ పీఠం ద‌క్క‌గా, రెండో సారి కూడా ఉద్య‌మకారుల కుటుంబానికి మేయ‌ర్ పీఠాన్ని క‌ట్ట‌బెట్టింది టీఆర్ెస్. తెలంగాణ భవన్ నుంచి చివరి వరకు గులాబీదళం మెజారిటీ ఉన్నందున ప్రణాళిక బద్దంగా ముందుకెళ్లింది. అత్యాశలో కమలనాధులు మ‌ధ్య‌మ‌ధ్య‌లో వాగ్వాదం చేసినా చివ‌ర‌కు ఎన్నిక ప్ర‌క్రియ స‌జావుగానే ముగిసింది. టీఆర్ఎస్ రిజర్వేషన్ కు మించి టిక్కెట్ల లో మ‌హిళ‌ల‌కే పెద్దపీట వేసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ పదవుల్లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వ‌డం విశేషం. గ్రేట‌ర్‌పై గులాబీ జెండా ఎగ‌ర‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ ఎస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి.

గ్రేట‌ర్ పీఠంపై గులాబీ జెండా.. ఉద్య‌మ‌బిడ్డ‌కు మేయ‌ర్ ప‌ద‌వి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts