దేవుడా : కూల్ డ్రింక్ బాటిల్ ఆర్డర్ చేస్తే చివరికి…!?

February 23, 2021 at 8:47 pm
cool drink

నేటి సమాజంలో ఏది కావాలని అనుకున్నా ఆన్ లైన్ లో ఆర్డర్ పెడితే చాలు డైరెక్ట్ ఇంటికి వచ్చి ఇచ్చిపోతుంటారు. ఇక చాల మంది ఫుడ్ ని ఇంటికే ఆర్డర్ తెప్పించుకొని తింటుంటారు. అయితే ఓ వ్యక్తి కూడా చల్ల చల్లగా కూల్ డ్రింక్ తాగుదామని అనుకుని ఒక కూల్ డ్రింక్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే అతనికి ఆ ఫుడ్‌ డెలివరీ కంపెనీ కూల్ డ్రింక్ కు బదులుగా యూరిన్ నింపిన బాటిల్ పంపారట. ఈ దారుణ ఘటన యూకేలో చోటు చేసుకుంది. అసలు వివరాలలోకి వెళితే ఒలీవర్‌ మెక్‌మానస్‌ లాక్‌డౌన్‌లో భోజనం ఆర్డర్‌ చేశాడు. అందులో కూల్‌డ్రింక్‌ కూడా ఉంది.

cool drink

cool drink

అంతేకాదు యూరిన్‌ నింపిన కూల్‌డ్రింక్‌ బాటిల్‌ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ దాన్ని పంపిన హెల్లో ఫ్రెష్‌ యూకే కంపెనీ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీ అడ్రస్‌ చెప్తే దీన్ని మీకు పంపిస్తానని ట్విటర్‌లో రాసుకొచ్చాడు. ఇంకేముందీ అతడి ట్వీట్‌ కాస్త వైరల్‌గా మారగా ఏం జరిగిందో వివరించి చెప్పండి అంటూ జనాలు అతడి వెంటపడ్డారు. దీంతో ఇదెక్కడి గోలరా నాయనా అనుకున్న మెక్‌ తెల్లవారేసరికి ఆ ట్వీట్‌ డిలీట్‌ చేశాడు. అయితే అప్పటికే ఈ వార్త దావానంలా వ్యాపించగా మేలుకొన్న హలో ఫ్రెష్‌ కంపెనీ సదరు వ్యక్తికి క్షమాపణలు చెప్పింది. జరిగిన తప్పిదానికి మీకు ఎలా క్షమాపణలు చెప్పాలో అర్థం కావడం లేదని చింతిస్తూ ట్వీట్‌ చేసింది.

అయితే ఈ బాటిల్‌కు ఆ కంపెనీకి అసలు ఎలాంటి సంబంధమే లేదట. ఆ కంపెనీ కేవలం భోజనం పంపుతుందే తప్పఎటువంటి కూల్‌డ్రింక్స్‌ పంపదని నెటిజన్లు అంటున్నారు. కాకపోతే డెలివరీ బాయ్‌ మూత్ర విసర్జన చేసే సమయం లేకపోవడంతో బాటిల్‌లోనే కానిచ్చేసి ఉంటాడని, ఆ సంగతి మర్చిపోయి ఆ బాటిల్‌ను నేరుగా కస్టమర్‌కు డెలివరీ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. మెక్‌ కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఇది డెలివరీలో జరిగిన పొరపాటు కావచ్చని చెప్పుకొచ్చాడు.

దేవుడా : కూల్ డ్రింక్ బాటిల్ ఆర్డర్ చేస్తే చివరికి…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts