అరియానాకు గూగుల్ షాక్‌.. ఆనంద‌మంతా ఆవిరైపోయిందే!

February 11, 2021 at 7:27 pm

అరియానా గ్లోరీ.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంక‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అరియానా.. రామ్ గోపాల్ వ‌ర్మ ఇంట‌ర్వ్యూ ద్వారా కాస్త పాపుల‌ర్ అయింది. ఇక ఇటీవ‌ల తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో అడుగు పెట్టిన అరియానా.. ఊహించ‌ని స్థాయిలో క్రేజ్ తెచ్చుకుంది.

అంతేకాదు, టాప్‌-5 వ‌ర‌కు చేరుకుని మిగిలిని కంటెస్టెంట్ల‌కు గ‌ట్టి పోటీ కూడా ఇచ్చింది. బిగ్ బాస్ త‌ర్వాత అరియానా రేంజ్ మారిపోయింది. పాపుల‌ర్ సెల‌బ్రిటీగా మారిన అరియానా..రాజ్ త‌రుణ్ స‌ర‌స‌న సినిమాలో న‌టించే అవ‌కాశాన్ని కూడా అందుకుంది. ఇదిలా ఉంటే..అరియానాకు ఓ అరుదైన ఘనత దక్కింది. గూగుల్‌లో ప్రిన్సెస్‌ ఆఫ్‌ బిగ్‌బాస్‌ తెలుగు అని టైప్‌ చేయగా అరియానా గ్లోరీ అని చూపించడం విశేషం.

దీంతో తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలోనే ఇంతటి ఘనత దక్కిన తొలి కంటెస్టెంట్‌గా ఆమె నిలిచింది. ఇదే విష‌యాన్ని అరియానా కూడా అభిమానుల‌తో పంచుకుంటూ ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. కానీ, ఇప్పుడు ఆమె ఆనంద‌మంతా ఆవిరైపోయింది. తాజాగా గూగుల్ అరియానా పేరుని తొలగించి.. ఆమెకు షాక్ ఇచ్చింది. దీంతో అరియానాతో పాటు ఆమె ఫ్యాన్స్ సైతం చింతిస్తున్నార‌ట‌.

అరియానాకు గూగుల్ షాక్‌.. ఆనంద‌మంతా ఆవిరైపోయిందే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts