గూగుల్ నుంచి ఆ సర్వీస్ బంద్ …ఎందుకంటే..!?

February 19, 2021 at 12:20 pm

ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు వాడుతున్న వినియోగదారులకు గూగుల్ ఈ మ‌ధ్య కొన్ని రిమైండ‌ర్లు పంపిస్తోంది. త‌మ ప్ర‌ముఖ స‌ర్వీసు ప్లే మ్యూజిక్‌ను ఈ నెల 24న డిలీట్ చేయ‌బోతున్నామ‌న్న‌ది ఆ రిమైండ‌ర్ తాలూకు సారాంశం. అందులో భాగంగా గూగుల్ ప్లే మ్యూజిక్‌లో ఉన్న లైబ్ర‌రీ, డేటా మొత్తాన్ని డిలీట్ చేస్తామ‌ని కూడా గూగుల్ తెలిపింది. ఒక‌సారి ఈ డేటా డిలీట్ చేసిన త‌ర్వాత మ‌ళ్లీ రిక‌వ‌ర్ చేయ‌డానికి వీలుప‌డ‌దంటూ చెప్పింది.

ఇప్ప‌టికే వినియోగదారులను ప్లే మ్యూజిక్ నుంచి యూట్యూబ్ మ్యూజిక్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన‌ట్లు గూగుల్ తెలిపింది. మీరు గూగుల్ ప్లే మ్యూజిక్ లైబ్ర‌రీ, డేటాను డౌన్‌ లోడ్ చేసుకోవాలి అ‌నుకుంటే ఫిబ్ర‌వ‌రి 24లోపు గూగుల్ టేక్ అవుట్ నుంచి చేసుకోవ‌చ్చ‌ని కూడా గూగుల్ తెలిపింది. గ‌త సంవత్సరం డిసెంబ‌ర్‌లోనే గూగుల్ ప్లే మ్యూజిక్ ఆప‌రేష‌న్ల‌ను నిలిపివేసి, దానిని యూట్యూబ్ మ్యూజిక్‌గా మార్చింది.

గూగుల్ నుంచి ఆ సర్వీస్ బంద్ …ఎందుకంటే..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts