ఆ హిట్ డైరెక్ట‌ర్‌తో బాల‌య్య సినిమా ఫిక్స్‌..ప్రూఫ్ ఇదే?

February 24, 2021 at 8:52 am

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో `బిబి3` పేరిట ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌, పూర్ణ ఈ చిత్రంలో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

అయితే ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య ఓ హిట్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేసేందుకు రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. గోపీచంద్ మాలినేని. ఇటీవ‌ల `క్రాక్‌` చిత్రాన్ని తెర‌కెక్కించి సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నాడు గోపీచంద్‌. ఇప్పుడు అదే జోష్‌లో బాల‌య్య‌తో ఓ సినిమా చేసేందుకు గోపీచంద్ రెడీ అయ్యాడ‌ట‌.

గ‌తంలో ఇలాంటి వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. నిజ‌మా? కాదా? అన్న క్లారిటీ రాలేదు. కానీ,ఇప్పుడు మాత్రం ఈ కాంబోలో సినిమా ఫిక్స్ అయ్యిపోయిందని తెలుస్తుంది. నిన్న గోపీచంద్ మాలినేని బాల‌య్య‌తో దిగిన ఫొటోను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు. దీంతో నంద‌మూరి అభిమానులు బాల‌య్య‌-గోపీచంద్ మాలినేని కాంబో మూవీ సెట్ అయ్యింద‌ని.. ఈ ఫొటోనే ప్రూఫ్ అని అంటున్నారు.

ఆ హిట్ డైరెక్ట‌ర్‌తో బాల‌య్య సినిమా ఫిక్స్‌..ప్రూఫ్ ఇదే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts