అదిరిపోయిన గోపీచంద్ `సీటీమార్` టీజ‌ర్!

February 22, 2021 at 10:57 am

టాలీవుడ్ యాక్ష‌న్ హీరో గోపీచంద్ తాజా చిత్రం `సీటీమార్‌`. సంపత్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో త‌మ‌న్నా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్లుగా న‌‌టిస్తున్నారు. భూమిక ముఖ్య పాత్ర పోషిస్తోంది. పవన్‌ కుమార్‌ సమర్పణలో సిల్వర్‌ స్ర్కీన్‌ పతాకంపై శ్రీనివాసా చిత్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. విలన్‌ పాత్రదారి `కబడ్డీ.. కబడ్డీ.. కబడ్డీ.. `అని గాంభీర్యంగా అరవ‌డంతో ప్రారంభమైన ఈ టీజ‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంది.

గోపీచంద్ గ్రాండ్ ఎంట్రీ, గ్రౌండ్‌లో కబడ్డీ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆక‌ట్టుకున్నాయి. అలాగే `కబడ్డీ.. మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట` అంటూ గోపీచంద్ చేప్పే డైలాగ్ అద్భుతంగా ఉంది. మొత్త‌నికి ఈ టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంతో పాటు సినిమాపై అంచ‌నాల‌ను కూడా పెంచేసింది.

అదిరిపోయిన గోపీచంద్ `సీటీమార్` టీజ‌ర్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts